ప్రయాణికులకు విజ్ఞప్తి.. ప్లాట్‌ఫాం నం.1 బంద్‌

ప్రయాణికులకు విజ్ఞప్తి.. ప్లాట్‌ఫాం నం.1 బంద్‌

TG: మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్‌ పురాతన భవనం తొలగింపు లూప్‌లైన్ల విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్లాట్‌ఫాం నం.1లో రైళ్లు ఆగవన్నారు. ఇక రైళ్లన్నీ రెండు, మూడో ప్లాట్‌ఫారాలపై ఆగనున్నాయని అధికారులు పేర్కొన్నారు.