VIDEO: ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: MLA
ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA పాయల్ శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని రాంపూర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మంజూరైన పల్లె దవాఖానను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. DMHO నరేందర్ రాథోడ్, నాయకులు తదితరులు ఉన్నారు.