'నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ'

MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ,యువకులు వివిధ ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్‌లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తుల సమర్పించాలి.