ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

కర్నూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో దరఖాస్తులు తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. వచ్చే నెల 6 నుంచి ప్రవేశాలు జరుగుతాయన్నారు. జూన్ 1వ తేదీ నాటికి అన్ని ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజీలను బుధవారం ఆదేశించారు.