'సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు'
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం ZPHS, ప్రాథమిక పాఠశాలలో ఇవాళ ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.