కిడ్నాప్ గురైన బాధితులను రక్షించాలి: ఎంపీ

కిడ్నాప్ గురైన బాధితులను రక్షించాలి: ఎంపీ

NDL: విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి బి. శ్యామ్‌ను సోమవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి, మయన్మార్ సరిహద్దు వద్ద మోసపూరితంగా బంధించబడి తీవ్రమైన హింస, బలవంతపు పనులకు గురవుతున్న జిల్లా యువకులు గండబోయిన భువనేశ్, గండబోయిన దినేశ్ సహా 10 మంది భారతీయుల రక్షణ కోసం అత్యవసర చర్యలు తీసుకోవాలని కోరారు. వీరిని వెంటనే గుర్తించి రక్షించాలన్నారు.