అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ఇటీవల కాలంలో తుఫాన్ కారణంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న పంటల నివేదికను అందజేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.