బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

CTR: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. బైక్ చోరీలపై ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేపట్టామన్నారు. వాహనాల తనిఖీలో ఇద్దరు అనుమానితులను సిబ్బంది పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. మంగసముద్రానికి చెందిన మహేష్, ధర్మరాజుల కాలనీకి చెందిన వసీంను నిందితుడిగా గుర్తించి రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.