పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

SKLM: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న పశువులతో వెళుతున్న వాహనాన్ని మందస మండలం కొర్రాయి గేటు వద్ద జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాహనంలో 16 గేదెలు రవాణా అవుతున్నాయని వివరించారు.