జడ్చర్లలో విద్యుత్ మెరుగుదలకు రూ.231.50 కోట్లు
MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి, గృహ జ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్, గృహావసరాలకు కొత్త కనెక్షన్లు అందించడానికి ఇప్పటివరకు రూ. 231.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తిమ్మాజీపేట 132 కేవీ డబుల్ సర్క్యూట్ లైన్ నిర్మాణాన్ని రూ. 19.20 కోట్లతో పూర్తి చేయించామని తెలిపారు.