బెల్లంపల్లి ఏసీపీగా కిరణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
MNCL: బెల్లంపల్లి నూతన ACPగా కిరణ్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించే ముందు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.