75,566 కుటుంబాలు గుర్తింపు

SKLM: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన P-4 విధానాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 20 శాతం వెనుకబడిన కుటుంబాలను “బంగారు కుటుంబాలు”గా గుర్తించామని, జిల్లాలో మొత్తం 75,566 కుటుంబాలు ఎంపికయ్యారన్నారు.