ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: DM
NRML: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వివిధ ప్రదేశాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పండరీ తెలిపారు. గురువారం నిర్మల్ డిపో నుండి కాశీ అయోధ్యకు బస్సు సర్వీసును ప్రారంభించారు. నిర్మల్ డిపో నుండి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణికుల కోరిక మేరకు ఆర్టీసీ సర్వీస్‌లను నడుపుతున్నామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.