స్పెషల్‌ సీఎస్‌ జయలక్ష్మిని కలిసిన కలెక్టర్

స్పెషల్‌ సీఎస్‌ జయలక్ష్మిని కలిసిన కలెక్టర్

సత్యసాయి: ఏడో రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన సీసీఎల్‌ఏ, స్పెషల్‌ సీఎస్‌ జయలక్ష్మికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆర్డీటీ స్టేడియం సమీపంలోని అతిథి గృహంలో సీసీఎల్‌ఏను కలెక్టర్‌ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్‌ మర్యాదపూర్వకంగా కలిసి, పూలమొక్క అందజేశారు.