ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

ఖమ్మం జిల్లాలోని అనేక ఆర్వో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పరిశుభ్రత పాటించకపోవడంతో నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. అధికారుల నిఘా లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.