శ్రీశైలం డ్యాంకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యాంకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత

NDL: శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 5,00,019 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో గురువారం ఉదయం 6 గంటల సమయంలో డ్యాం 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తారు. 4,18,630 క్యూసెక్కులు, అదనంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా 64,910 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 881.60 అడుగులుగా ఉంది.