రేపు కుప్పంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

రేపు కుప్పంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

CTR: కుప్పంలో ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జగదీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బెంగళూరు శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.