'కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదు'
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కార్యాయలం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఓ వృద్ధురాలు ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ చిత్రామిశ్రా కాళ్లపై పడి వేడుకుంది. పోరండ్లకు చెందిన కర్ర లక్ష్మి, భర్త రాజిరెడ్డి దంపతులు. నాలుగేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందారు. అతని పేరున ఉన్న మూడున్నర ఎకారల వ్యవసాయ భూమిని తన పేరుపై నమోదు చేయాలని బాధితురాలు కోరారు.