చిత్తడిగా మారిన ముద్దునూరు రోడ్లు

KMM: తల్లాడ మండలం ముద్దునూరు గ్రామ పంచాయతీలో పంట పొలాలకు వెళ్లే రహదారులు వర్షాల కారణంగా చిత్తడిగా మారాయి. దీంతో రైతులు పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి వెంట దళితులకు చెందిన భూములు ఎక్కువగా ఉన్నాయని, రోడ్డు లేక వారు నష్టపోతున్నారని రైతులు వాపోయారు. సమస్యపై ప్రభుత్వం స్పందించి వెంటనే మెటల్ రోడ్డు మంజూరు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.