VIDEO: శివాజీ విగ్రహానికి నిప్పు.. విచారణ చేపట్టిన ఎస్సై
WGL: రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో బుధవారం ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేందర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎవరు ఆందోళన చేద్దవద్దని ఆయన గ్రామస్తులకు తెలిపారు.