5.59 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం: JC

5.59 లక్షల రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధం: JC

E.G: జిల్లాకు సంబంధించిన 5,59,302 స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ పూర్తయిందని, వాటిని తహశీల్దార్ కార్యాలయాలకు పంపినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శనివారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా కార్డుదారుల ఇళ్ల వద్దే వీటిని పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.