రేపటి నుంచి మూడు నెలల రేషన్ పంపిణీ
NLG: ఏప్రిల్‌లో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి నల్లగొండ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం తరలిస్తున్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 5.27 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇయ్యనున్నారు.