రేపు ఉచిత వైద్య శిబిరం
VKB: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నవాబ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC)లో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్ వంటి నిపుణులు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.