అవధూత మఠంలో రేపటి నుంచి గురుచరిత్ర పారాయణం
NRPT: పట్టణంలోని శ్రీ సద్గురు అవధూత నరసింహస్వామి మఠంలో దత్త జయంతి సందర్భంగా గురువారం నుంచి డిసెంబర్ 3 వరకు శ్రీ గురుచరిత్ర పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓంప్రకాష్ తెలిపారు. డిసెంబర్ 4న స్వామివారికి డాలరోహణం, యజ్ఞం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు.