ఈ నెల 21న విద్యుత్ లోక్ అదాలత్
KDP: పులివెందుల డివిజన్ ఆఫీస్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న విద్యుత్ లోక్ అదాలత్ ప్రోగ్రాం నిర్వహించనునట్లు డివిజనల్ ఇంజనీర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాల వినియోగదారులకు సమస్యలు ఉన్నట్లయితే లోక్ అదాలత్‌కు వచ్చి రాతపూర్వకంగా అర్జీ ఇచ్చిన వెంటనే పరిష్కారం పొందొచ్చని పేర్కొన్నారు.