కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం
JGL: మాజీ సీఎం కేసీఆర్ పర్యటనలో అంతరాయం కలిగింది. జగిత్యాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద డ్రోన్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు కేసీఆర్ ల్యాండ్ అవుతున్న సమయంలో డ్రోన్లను ఎగురవేశారు. దీంతో కాసేపు ఆకాశంలోనే హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. అధికారుల అనుమతితో ఆయన సేఫ్‌గా దిగారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.