మంత్రి మెచ్చిన మాస్టారు.. రాంబాబుకు నారా లోకేష్ ప్రశంస
AKP: యలమంచిలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్లస్-2 తెలుగు అధ్యాపకుడు మువ్వల రాంబాబును మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. బడినే గుడిగా భావించి పాఠశాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ తన ఎక్స్ ఖాతాలో బుధవారం పోస్ట్ చేశారు. 69 మంది విద్యార్థులున్న ప్లస్-2 కాలేజీలో విద్యార్థుల సంఖ్యను 130కి పెంచడంలో రాంబాబు ఆదర్శంగా నిలిచారని లోకేష్ కితాబిచ్చారు.