VIDEO: 'ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం సరికాదు'
SRD: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రహమాన్ అన్నారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు శుక్రవారం మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం చొరవ సమస్య లపై సానుకూలంగా స్పందించాలని కోరారు.