VIDEO: ఆర్డీవో గ్రీవెన్స్‌కు 22 ఫిర్యాదులు
AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ అశోక్ ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు, పెన్షన్ల మీద ప్రజలు 22 ఆర్జీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఆర్డీవో వివి రమణ ఆదేశాల మేరకు సమస్యలు సత్వరం పరిష్కరిస్తున్నామన్నారు.