'కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ డ్రామా'
WGL: BRS పార్టీ కార్యాలయంలో ఈరోజు నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ డ్రామా ఆడుతుందన్నారు. “బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చట్టం చేయించి షెడ్యూల్‑9లో అవసరమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు.