విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గొర్రెల షెడ్ దగ్ధం

WGL: విద్యుత్ లైన్ తెగిపడి గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన నెక్కొండ మండలం పెద్దకోరుపోలులో చోటు చేసుకుంది. బాధితురాలు నూకల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం ఉపాధి కోసం షెడ్ వేసుకొని గొర్రెలు పెంచుకుంటున్నారు. బుధవారం గ్రామం మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్ లైన్ తెగి గొర్రెల షెడ్ పై పడడంతో 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 4లక్షల ఆస్తి నష్టం వాటిల్లిది అని తెలిపారు.