రహదారిపై పొగ మంచు.. ప్రజల ఇబ్బందులు

రహదారిపై పొగ మంచు.. ప్రజల ఇబ్బందులు

MHBD: గంగారం మండలం కేంద్రం నుంచి కొత్తగూడ వెళ్లే రహదారిపై ఉదయం పొగ మంచు తీవ్రంగా కమ్ముకుంది. దీంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగ మంచు సమయంలో ఎదురెదురుగా ప్రయాణించే వాహనదారులు, లైట్లు వేసుకుని, హారన్ శబ్దం చేస్తూ వెళ్లాలని పోలీసులు సూచించారు. శ్వాస సంబంధిత రోగులు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచించారు.