ఇంటర్ అడ్మిషన్లకు చివరి అవకాశం

WGL: వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆన్‌లైన్ ఇంటర్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో చివరి అవకాశం కల్పిస్తున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ గురువారం తెలిపారు. ఆగస్టు 31తో గడువు ముగిసినప్పటికీ, పలువురు విద్యార్థుల అడ్మిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ రెండు రోజుల్లో విద్యార్ధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.