పుంగనూరులో రేపు ఏకాంతంగా శ్రీవారి రథోత్సవం
CTR: శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి రథోత్సవం రేపు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఇన్స్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. ఇవాళ జరగాల్సిన రథోత్సవం చంద్రగ్రహణం కారణంగా రేపు జరుగుతుందని చెప్పారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఆలయ ఆవరణంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం చక్రస్నానం జరుగుతుందని చెప్పారు.