మోద గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం: MPDO
సత్యసాయి: పరిగి మండలం మోద గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల డిప్యూటీ ఎంపీడీవో విజయభాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు స్వీపర్స్‌తో కలసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. అలాగే డ్రైనేజీలు, రోడ్లను క్లీన్ చేయించారు. చెత్తను రోడ్లపై వేయకుండా వాహనాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రెటరీ భార్గవి, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.