ఈనెల 14 వరకు హౌసింగ్ సర్వే గడువు పొడిగింపు
ATP: అందరికీ ఇండ్లు, స్థలం నినాదంతో చేపట్టిన హౌసింగ్ సర్వే గడువు తేదీని ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి శైలజ తెలిపారు. నవంబర్ 10 నుంచి 30 వరకు నిర్వహించిన సర్వేలో దాదాపు 50 వేల కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈనెల 14 వరకు జిల్లాలోని అర్హులందరీతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.