టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు తప్పనిసరి
అన్నమయ్య: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా DEO సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఫీజు చెల్లించే ముందు విద్యార్థుల పుట్టిన తేదీ, ఇంటి పేరు, తల్లిదండ్రుల వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.