జర్నలిస్టుల నిర్బంధం మరోసారి రిపీట్ కాదు: సీపీ

HYD: ఓ యాప్‌పై నమోదైన కేసుతో పాటు సికింద్రాబాద్ రిపోర్టర్ నర్సింగ్ రావు అక్రమ నిర్బంధంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను జర్నలిస్టులు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. వార్తను వార్తగా ప్రచురించిన ఓ న్యూస్ యాప్‌పై కేసు ఎత్తివేయాలని కోరారు. కేసును తీసేస్తానని, జర్నలిస్ట్‌లకు సీపీ హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.