'ఇళ్ల గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి'
MNCL: చెన్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఇళ్ల గణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం హాజరయ్యారు. మే 11వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇళ్ల గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం వేళలో ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.