వైభవంగా అయ్యప్ప పల్లకి ఊరేగింపు కార్యక్రమం
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు కార్యక్రమం శనివారం ఉదయం వైభవంగా చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు మంగళ హారతులు చేతబట్టుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటారు. డీజే పాటలకు అనుగుణంగా అయ్యప్ప స్వాములు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.