అల్లూరి జిల్లా జేఏసీ నూతన కార్యవర్గ ఎన్నిక
ASR: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి అల్లూరి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలను ఆదివారం పాడేరులో నిర్వహించినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంజయ్య తెలిపారు. జిల్లా జేఏసీ ఛైర్మన్‌గా రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీగా గిరి, వైస్ ఛైర్మన్‌లుగా జగన్మోహన్, సంజీవరాజు, నాగభూషణరాజు తదితరులు ఎన్నికయ్యారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.