నేడు నింగిలోకి బాహుబలి రాకెట్
AP: శ్రీహరికోటలోని షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి ఈరోజు సా. 5:26 గంటలకు LVM3-M5 బాహుబలి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా CMS-03 అనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని (4,410 కిలోలు) కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది.