'మౌలిక సదుపాయాలు అందించడమే ప్రధాన ఉద్దేశ్యం'

E.G: ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఇంటికి మౌలిక సదుపాయాలు అందించడమే ప్రధాన ఉద్దేశ్యం అని రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ & స్పెషల్ ఆఫీసర్ కేతన్ గార్గ్ తెలిపారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట, శాటిలైట్ సిటీ పంచాయతీలలో ఆయన విస్తృత పర్యటన చేశారు. డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతాం అని స్పష్టం చేశారు.