అధిక లోడుతో ఆటోలు.. ఆరుగురు డ్రైవర్లపై కేసు

అధిక లోడుతో ఆటోలు.. ఆరుగురు డ్రైవర్లపై కేసు

NRPT: జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. పాఠశాల విద్యార్థులను అధిక సంఖ్యలో ఆటోల్లో తరలిస్తుండగా వారిని గుర్తించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించి, పిల్లల ప్రాణ భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.