నేడు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రాక

TPT: రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ జిల్లా పర్యటనకు మంగళవారం రానున్నారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12గంటలకు రుయా ఆస్పత్రికి చేరుకుంటారు. వైసీపీ రౌడీమూకల దాడిలో గాయపడ్డ పవన్‌ను పరామర్శిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. 2గంటలకు అధికారులతో సమీక్షించి, తిరిగి విజయవాడకు బయలుదేరి వెళతారు.