చిట్టమూరులో వైసీపీ రచ్చబండ కార్యక్రమం
PTP: వైద్య విద్యార్థులకు విద్య, రోగులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో వైసీపీ హయాంలో జగన్ 17 కాలేజీలను ప్రారంభించారని ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్ తెలిపారు. ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిట్టమూరు మండలం మొలకలపూడిలో ఆదివారం రచ్చబండ నిర్వహించారు.