సెలవులలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు

అన్నమయ్య: చిట్వేలు మండలంలో ప్రైవేటు విద్యాసంస్థలు వేసవి సెలవులలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతులు నిర్వహిస్తే పాఠశాల యాజమాన్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చిట్వేలు MEO కోదండ నాయుడు అన్నారు. జూన్ నెల 12వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిందని అన్నారు. ముందస్తు అడ్మిషన్లు చేపట్టినా, అధిక ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవన్నారు.