ఘనంగా హజరత్ ఔలియావలీ ఖాదర్ మహోత్సవం

ఘనంగా హజరత్ ఔలియావలీ ఖాదర్ మహోత్సవం

KDP: సిద్దవటం బేల్దారివీధిలో వెలసిన శ్రీశ్రీశ్రీ హాజరత్ ఖాదర్ ఔలియావలీ దర్గాలో ఆదివారం రాత్రి గంధమహోత్సవం ఘనంగా జరిగింది. సయ్యద్ అహమ్మద్ గయాజ్ ఇంటి వద్ద నుంచి ఫకీర్ల మేళతాళాలతో గంధం ఖాదర్ ఔలియావలీ దర్గాకు చేరింది. దర్గాలో ఫాతేహా నిర్వహించిన అనంతరం గంధాన్ని అర్పించారు. గంధ మహోత్సవం సందర్భంగా ఫకీర్లు నిర్వహించిన విన్యాసాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది.