నెరవేరని విజయనగరం- పాలకొండ రోడ్డు ఉన్నతీకరణ
VZM: విజయనగరం- పాలకొండ R&B ప్రధాన మార్గాన్ని జాతీయ రహదారిగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు ఎప్పటికి మోక్షం లభిస్తుందని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. గత ప్రభుత్వం అయిదేళ్ల పాటు ఈ రోడ్డును పట్టించుకోకపోవడంతో అధ్వానంగా తయారైంది. రద్దీకి అనుగుణంగా విస్తరణ లేకపోవడంతో విజయనగరం, నెల్లిమర్ల, గరివిడి పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది.