'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
SKLM: మత్తు పదార్థాలకు ప్రతీ ఒక్కరూ దూరంగా ఉండాలని శ్రీకాకుళం RDO సాయి ప్రత్యుష పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని ఆమె కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో యువత మేలుకో అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయన్నారు. ఏఐవైఎఫ్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.